పార్కింగ్ నిర్వహణ కోసం దరఖాస్తు గడువు పెంపు

73చూసినవారు
పార్కింగ్ నిర్వహణ కోసం దరఖాస్తు గడువు పెంపు
విశాఖ నగర పరిధిలో కంచరపాలెం, గోపాలపట్నం రైతు బజార్ల వద్ద ఖాళీ స్థలంలో పార్కింగ్ నిర్వహణ కోసం దరఖాస్తుల గడువును వచ్చేనెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈనెల 28న దరఖాస్తు గడువు ముగిసినా దరఖాస్తుదారులు రాకపోవడంతో గడువును పొడిగించినట్లు తెలిపారు. బహిరంగ వేలంలో పాల్గొనేవారు రూ. 10, 000 ధరావత్తు చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్