గాజువాక సమీపంలోని తలారవానిపాలెం రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి డబల్ రోడ్డు వేయ్యాలని డిఆర్ఎం లలిత్ బోరాకు గురువారం వినతిపత్రం అందజేశారు. అగనంపూడి ప్రాంత రైల్వే సమస్యల పై గ్రామస్తులు డీఆర్‌ఎంను విశాఖ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. డిఆర్ఎం లలిత్ బోరా సానుకూలంగా స్పందించి త్వరలో తలారవానిపాలెం రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.