చింతపల్లి: పూతికపుట్టులో డ్రైడే ఫ్రైడే

71చూసినవారు
చింతపల్లి: పూతికపుట్టులో డ్రైడే ఫ్రైడే
చింతపల్లి మండలంలోని తమ్మేంగుల ఆరోగ్య ఉప కేంద్రం పరిధి పూతికమెట్టలో ఆశా కార్యకర్త చిన్నమి ఆధ్వర్యంలో గిరిజనులు శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని కొళాయిల్లో వీధుల డ్రైనేజీల్లో మురుగును తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్