చింతపల్లి మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధి జంగంపాకలులో ఆశా కార్యకర్త లింగమ ఆధ్వరంలో గిరిజనులు శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని డ్రైనేజీల్లో, కొళాయిల చుట్టుపక్కల, మురుగు నీటిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు ఉండరాదని, పనికిరాని వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఉంచరాదన్నారు. వీటివల్ల దోమలు పెరిగి మలేరియా డెంగి వ్యాధులు వస్తాయని అవగాహన కల్పించారు.