చింతపల్లి మండలంలోని కొమ్మంగి పంచాయతీ పరిధి నాగులగొందికి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి అర్ధాంతరంగా విడిచిపెట్టేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బంగార్రాజు సోమరాజు గంగరాజు గిరిబాబు రమణమూర్తి బుధవారం వాపోయారు. అర్ధాంతరంగా నిలిపివేసిన ఈ రహదారికి నిర్మించి తమ కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.