చింతపల్లి మండలంలోని తమ్మెంగుల పంచాయతీ పరిధి భీమనపల్లి బొడ్డపుట్టు తదితర గ్రామాలకు రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సరైన రహదారి సౌకర్యం లేక ఆర్టీసీ బస్ సౌకర్యం లేక సోమవారం అన్నవరం వారపు సంతకు పప్పుదినుసులు విక్రయానికి తీసుకొచ్చిన గిరిజనులు ప్రైవేటు జీపులను ఆశ్రయించి తమ గ్రామాలకు ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. రహదారి సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.