1/70 చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని గిరిజన ప్రజలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలని బిసివై పార్టీ జిల్లా ఇన్ ఛార్జ్ రాజన్ డిమాండ్ చేశారు. సోమవారం జి. మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీలోని గాదిగుంటలో గిరిజన చట్టాలపై గిరిజనులకు అవగాహన కల్పించి మాట్లాడారు. విశాఖలో టూరిజం ఇన్వెస్టర్ సమ్మీట్ లో జరిగిన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగించేలా ఉందన్నారు.