జి. మాడుగుల మండలంలోని గెమ్మెలి పంచాయతీ పరిధి సేమకూరపాలెంలో 0. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఏరియా ఆసుపత్రి గెమ్మెలి ఏరియా ఆస్పత్రి సిబ్బంది బుధవారం వ్యాధి నిరోధక టీకాలు వేశారు. బాల్యంలో పిల్లలు బీసీజీ టీకా తీసుకోవడం వల్ల పెద్దయ్యక వ్యాధిని దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్య సిబ్బంది అన్నారు. అందుకే పిల్లలకు పుట్టినప్పటి నుంచి పలు రకాల టీకాలు వేయించాలని వైద్య సిబ్బంది సరస్వతి సిబ్బంది తెలిపారు.