జి. మాడుగుల: అరగడపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలి

60చూసినవారు
జి. మాడుగుల: అరగడపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలి
జీ. మాడుగుల మండలంలోని కొరపల్లి పంచాయతీ పరిధి అరగడపల్లిలో మంచినీటి సమస్య పరిష్కరించాలని టీడీపీ బూత్ ఇన్‌ఛార్జ్ సతీశ్ కోరారు. ఆయన మాట్లాడుతూ వీధుల్లో కుళాయిలు ఏర్పాటు చేసి సంవత్సరం అవుతున్నా మంచినీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కొండ కాలువల ద్వారా వచ్చే నీటిని తెచ్చుకుని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని శుక్రవారం వాపోయారు. అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్