స్పీకర్ అయినపాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్ జయప్రదం చేయాలని పెసా కమిటీ ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కార్యదర్శి సుబ్బారావు పిలుపునిచ్చారు. అయ్యన్న వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం జి. మాడుగుల మండలంలోని పొత్తాడగొందిలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మండలంలో జరిగే మన్యంబంద్ ఆదివాసీలు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.