పొత్తాడగొందిలో 104 ద్వారా వైద్య శిబిరం

62చూసినవారు
పొత్తాడగొందిలో 104 ద్వారా వైద్య శిబిరం
జి. మాడుగుల మండలంలోని గెమ్మేలి పంచాయతీ పరిధి పొత్తాడగొంది గ్రామంలో 104 వాహనం ద్వారా సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి జి. మాడుగుల ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి సోమేశ్ పాల్గొని రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉదయం సమయంలో విపరితంగా చలి ఉండటం వల్ల పిల్లలు వృద్దులు తెల్లవారుజామున బయటకు రావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్