జి. మాడుగుల మండలంలోని పాలమామిడి పంచాయతీలో శుక్రవారం పెసా కమిటీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ అధ్యక్షుడుగా అప్పన, కార్యదర్శిగా వినోద్ కుమార్ ను పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో గిరిజన హక్కుల చట్టాలు పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రశాంత్, అప్పన్న, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.