గూడెం కొత్తవీధి మండలంలోని దేవరపల్లి పంచాయతీ పరిధి మంగళపాలెంలో శనివారం మువ్వల భాస్కరరావుకు చెందిన దుక్కిటెద్దు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. పొలంలో ఉన్న జియో టవర్ ట్రాన్స్ఫార్మర్ కి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాయాకష్టంలో తోడుండే దుక్కిటెద్దు చనిపోవడంతో బాధిత రైతు భాస్కరరావు కంటతడి పెట్టారు. ప్రభుత్వ అధికారులే గుర్తించి పరిహారం ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.