గూడెంకొత్తవీధి మండలంలోని పికే. గూడెంలో శుక్రవారం పీఎం జన్మన్ గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీపీ బోయిన. కుమారి సర్పంచ్ సుభద్ర ఎంపీటీసీ రాజేశ్వరి టీడీపీ మండల అధ్యక్షుడు రమేష్ పాల్గొని 45 గృహాల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. పీవిటిజి గిరిజనులకు గృహాలు మంజూరు చేసిన పీఎం మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ రాంబాబు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ తదితరులున్నారు.