అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పీఓగా పూర్తి అదనపు బాధ్యతలను జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ సోమవారం స్వీకరించారు. పోలవరానికి బదిలీపై వెళ్తున్న పి. ఓ వి. అభిషేక్ ఉదయం బాధ్యతలు నుండి తప్పుకున్నారు. నూతన పీఓ అభిషేక్ గౌడ 2024 జూలై 22 నుంచి పాడేరులో జేసీగా విధులు నిర్వహిస్తున్నారు. పివో అభిషేక్ గౌడను ఐటిడిఏ ఏపీఓలు ప్రభాకరరావు వేంకటేశ్వరరావు ఏఓ ఎం. హేమలత పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.