మామిడి తోటలు పూతకు వస్తున్న సమయంలో కురుస్తున్న మంచుతో పూత మాడిపోయి తోటలకు తీవ్ర నష్టం జరుగుతుందని గొట్టివాడకు చెందిన రైతు నారాయణరావు శనివారం తెలిపారు. కోటవురట్ల మండలంలో పలు గ్రామాల్లో మామిడి తోటలు పూతకు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి వరుసగా మామిడి తోటలు దిగుబడి ఇవ్వకపోవడంతో రైతులు నష్టాలను చవిచూశారని పేర్కొన్నారు. ప్రస్తుతం తోటలకు రైతులు క్రిమిసంహారిక మందులు పిచికారి చేస్తున్నట్లు చెప్పారు.