కోటవురట్ల మండలంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఈనెల 27న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ యూనియన్లకు చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. పీఆర్టీయూకు చెందినవారు గాదె శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇస్తుండగా, ఏపీటీఎఫ్కు చెందిన ఉపాధ్యాయులు పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇస్తున్నారు. మండలంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది.