ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుజాత తెలిపారు. కళాశాలలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజు భోజనాన్ని అందిస్తామన్నారు. ఈ పథకానికి అవసరమైన మెటీరియల్ ముందే కళాశాల నిధుల నుంచి సమకూర్చామన్నారు.