కోటవురట్ల మండలంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వారి విధులు బాధ్యతలపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. శుక్రవారం కోటవురట్ల మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ తరగతులను ఎంఈఓలు రామారావు, జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణ, విద్యా బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.