నక్కపల్లి: ఉపమాక వెంకన్నను దర్శించుకున్న హోంమంత్రి

61చూసినవారు
నక్కపల్లి మండలం ఉపమాక పుణ్యక్షేత్రంలోని వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆమెను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ కొప్పిశెట్టి కొండబాబు, మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్