నక్కపల్లి మండలం ఉపమాక శివారు సారిపల్లి వాణిపాలెం గ్రామానికి చెందిన ఎలమంచిలి నూకాలమ్మ(50) సోమవారం సాయంత్రం సారిపల్లివాణిపాలెం జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం నుంచి తుని వైపు వస్తున్న ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందిందని సిఐ కె కుమారస్వామి తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.