పాయకరావుపేట అంబేడ్కర్ పార్కులో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వైసీపీ నాయకులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. ఇటువంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిక్కాల రామారావు, జడ్పీటీసీ సూర్యనారాయణ పాల్గొన్నారు.