ఉపమాక లో ఘనంగా అమ్మవారి తిరువీధి సేవ

61చూసినవారు
ఉపమాక లో ఘనంగా అమ్మవారి తిరువీధి సేవ
నక్కపల్లి మండలం ఉపమాక క్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా సాయంత్రం గోదాదేవి అమ్మవారి తిరువీధి సేవ ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలో అర్చకులు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం రాజాధిరాజ వాహనంలో అమ్మవారిని అలంకరించి మాడవీధులలో ఊరేగించారు. తమ ఇంటి ముంగిటకు వచ్చిన అమ్మవారిని అనేకమంది భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.

సంబంధిత పోస్ట్