నిబంధనలకు వ్యతిరేఖంగా నడుపుతున్న 9 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేయగా. మూడు బస్సులను సీజ్ చేశామని ఉపరవాణాశాఖ అధికారి రాజారత్నం గురువారం తెలిపారు. గత 16 నుంచి ఇప్పటి వరకు నగరంలో మొత‍్తం 60 కేసులు నమోదు చేయగా 8 బస్సులను సీజ్ చేశామన్నారు. గురువారం పెందుర్తి నగరవా‍్యప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. కళాశాల, పాఠశాలల యాజామాన్యాలు ఇప్పటికైనా స్పందించి బస్సులు ఫిట్‌నెస్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు.