పరవాడ: ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి పరామర్శ

73చూసినవారు
పరవాడ: ప్రమాదంలో గాయపడిన కార్మికుడికి పరామర్శ
ఇటీవల పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడిని పెందుర్తి నియోజకవర్గం వైసీపీ నాయకుడు గండి రవికుమార్ పరామర్శించారు. శుక్రవారం కార్మికుడు కరణం ముత్యాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాజమాన్యం గాయపడిన కార్మికుడిని అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. అలాగే మెరుగైన చికిత్స అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్