మాఘ పౌర్ణమి సందర్భంగా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరంలో కొలువై ఉన్న వేణు మాధవస్వామి తీర్థ మహోత్సవానికి ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరిస్తున్నట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు ఆదివారం తెలిపారు. ఈనెల 11వ తేదీ రాత్రి నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు జరిగే తీర్థ మహోత్సవంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తీరం వద్దకు వాహనాలను అనుమతించడం లేదన్నారు.