పెందుర్తి: ప్రమాదానికి గురైన యువకుడు చికిత్స పొందుతూ మృతి

80చూసినవారు
పెందుర్తి: ప్రమాదానికి గురైన యువకుడు చికిత్స పొందుతూ మృతి
పెందుర్తి మండలం వేపగుంట వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు కేజీహెచ్ లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. సుజాతనగర్ కు చెందిన వెంకటేష్ (23) ఈనెల రెండవ తేదీన స్నేహితుడితో బైక్ పై పినగాడి నుంచి సుజాతనగర్ వెళుతూ గోతిలో పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను కేజీహెచ్ లో చేర్పించారు. పెందుర్తి సిఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్