పెందుర్తి మండలం అప్పన్నపాలెం గ్రామంలో భూలోకమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూలోకమ్మకు విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం మాజీ ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పీతల అప్పలరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు.