పెందుర్తి మండలం వెంకటాద్రి పర్వతం దిగువన వేంచేసి ఉన్న సూర్యనారాయణమూర్తిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం రథసప్తమి సందర్భంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామికి విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు.