సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించనున్నట్లు పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెతో పాటు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొంది. ఈ మేరకు కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.