అనకాపల్లి జిల్లాలో ఈనెల 15వ తేదీలోగా ఈక్రాప్ నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారుల సిబ్బందిని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు ఆదేశించారు. శుక్రవారం సబ్బవరం మండలం మల్లు నాయుడుపాలెంలో ఈ క్రాప్ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులు రబీ సీజన్ లో వేరుశెనగ, నువ్వు, అపరాల పంటలను సాగు చేస్తున్నారని అన్నారు. పంటలపై తెగుళ్లు ఆశిస్తే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టే విధంగా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు.