అప్పన్న సన్నిధిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి

83చూసినవారు
అప్పన్న సన్నిధిలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జె. కె. మహేశ్వరి శుక్రవారం దర్శించుకొన్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తికి లక్ష్మీ నరసింహ స్వామి వారి చిత్రపటాన్ని సింహాచలం ఈవో శ్రీనివాసమూర్తి అందజేశారు.

సంబంధిత పోస్ట్