ఎమ్మెల్సీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో దేవీపట్నం మండలంలోని ఇందుకూరు జంక్షన్ వద్ద ఎస్ఐ కే. షరీఫ్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వచ్చే పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచిపెట్టారు. డ్రైవర్లు విధిగా తమ వెంటా డ్రైవింగ్ పొల్యూషన్ ఆర్సి తదితర పత్రాలు ఉంచుకోవాలని ఎస్సై తెలిపారు. రూ. 50 వేల నగదు కంటే ఎక్కువ కలిగి ఉంటే తగిన ఆధారాలు చూపించాలన్నారు.