ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామం లో జాతీయ రహదారి పైన శనివారం కారు ఢీ కొన్న ఘటనలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. సంఘటన స్థలంలో ఎటువంటి వాహనాలు కానీ జన సంచారం లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.