విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శుక్రవారం ఫ్లెక్సీల కలకలం రేగింది. 35వ వార్డు వైఎస్సార్‌సీపీతో పాటు కూటమి నేతల ఫ్లెక్సీలున్నాయి. అయితే కేవలం వైసీపీ ఫెక్సీలను జీవీఎంసి అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సహకారంతో వైసీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు.