జీకే. వీధి: గర్భిణీలు బాలింతలకు కోడిగుడ్లు పంపిణీ

65చూసినవారు
జీకే. వీధి: గర్భిణీలు బాలింతలకు కోడిగుడ్లు పంపిణీ
గూడెంకొత్తవీధి మండలంలోని కమ్మరితోట అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు బాలింతలకు ఆశాకార్యకర్త కాంతమ్మ శుక్రవారం కోడిగుడ్లు బెల్లం రాగిపిండి ఖర్జూరం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కింద బాలింతలు, గర్భిణీలకు ప్రభుత్వం అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గుడ్లు ప్రోటీన్, విటమిన్లు ఖనిజాల వంటి అవసరమైన పోషకాలతో ఇవి గర్భాధారణ సమయంలో తల్లి, శిశువుల ఆరోగ్యానికి అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్