
4 కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించాం: మోదీ
దేశంలో పదేళ్లలో పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 'ఐదేళ్లలో 12 కోట్ల మందికి తాగునీటి వసతి కల్పించాం. 4 కోట్ల మంది పేదలకు గృహ వసతి కల్పించాం. పేదల కోసం 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించాం. డిజిటల్ లావాదేవీలతో పారదర్శకత తీసుకొచ్చాం. స్వచ్ఛ్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం' అని లోక్సభలో PM స్పష్టం చేశారు.