భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

69చూసినవారు
భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు
మా పెళ్లికి రండి అంటూ నూతన వధూవరులు పిలవడం ఇప్పటివరకు చూశాం. కానీ మా భర్త మూడో పెళ్లి రండంటూ ఇద్దరు భార్యలు ఆహ్వానం పలకడం అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో చోటు చేసుకుంది. పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం కాగా పిల్లలు పుట్టలేదని అప్పలమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007లో ఒక బాబు పుట్టాడు. రెండో సంతానం కావాలని భర్త కోరగా ఇద్దరు భార్యలు కలిసి స్వయంగా పెళ్లి పత్రికలు కొట్టించి భర్తకు లావ్య అనే యువతితో మూడో పెళ్లి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడోపెళ్లి వైరల్‌ అయింది. విశాఖ మన్యంలో రెండేసి పెళ్లిళ్లు సర్వసాధరణమే. మూడో పెళ్లే సంప్రదాయం కూడా కొనసాగిస్తుండడం విశేషం. ఈ వార్త ఆదివారం నెంటింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్