
విశాఖ: ఘనంగా అమర్ జన్మదిన వేడుకలు
విశాఖ తూర్పు నియోజకవర్గ పరిశీలకులు మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అమర్నాథ్ కు పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ నాయకులు, మువ్వల సురేష్, పళ్ళ దుర్గ పాల్గొన్నారు.