
విశాఖ:పార్టీకి వెళుతున్నావా పుష్పా?..
న్యూ ఇయర్ వేడుకలు సందర్భంగా అర్ధరాత్రి ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వచ్చేస్తుంటారు. విశాఖ బీచ్ రోడ్డులో కేకులు కోస్తూ, బాణాసంచా కాలుస్తూ అల్లరి చేస్తుంటారు. పార్టీ పూర్తయ్యాక సరదాకోసం అతివేగంగా వాహనాలు నడపడం, తాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం చేస్తే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేసిన వాళ్లవుతారు. ఎందుకంటే, న్యూ ఇయర్ రోజునే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని విశాఖ పోలసులు చెబుతున్నారు.