ఈనెల 12వ తేదీన వైశాఖ పౌర్ణమి వేడుకలు

76చూసినవారు
ఈనెల 12వ తేదీన వైశాఖ పౌర్ణమి వేడుకలు
విశాఖపట్నం పూర్ణ మార్కెట్ ఎదురుగా గల ఇసుక కొండపై వెలసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానములో ఈనెల 12న వైశాఖ పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వాహణ అధికారి టి. రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం వేకువజామున 2. 30 గంటలకు ఆరాధన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదయం 4. 30 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్