78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రం అచ్చుతాపురం సచివాలయంలో గురువారం సర్పంచ్ కుండ్రపు విమల నాయుడు జెండా ఆవిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. సర్పంచ్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అనేక ఇబ్బందుల మధ్య చాలీచాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బొందల శ్యామ్, బాజ్జి, కూనశెట్టి రమణ పాల్గొన్నారు.