కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము డిమాండ్ చేశారు. బుధవారం అచ్యుతాపురంలో ఈ మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకువస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్రం అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. లేబర్ కోడ్ లను ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి కేంద్ర కుట్రలు పండుతుందన్నారు.