భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అచ్యుతాపురం తహసిల్దార్ జనార్ధన్ అన్నారు. శుక్రవారం అచ్యుతాపురం మండలం దుప్పర్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలు ఆక్రమణలు భూ వివాదాలపై అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ వీటిపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.