హరిపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడు పి టి వెంకటేశ్ పదవి విరమణ పూర్తయిన సందర్భంగా బుధవారం 165 మంది విద్యార్థులకు స్టీల్ కంచాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శ్రీపాద రవి మరియు తోటి ఉపాధ్యాయులు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు టీచర్ రమణి, వ్యాయామ ఉపాధ్యాయుడు రాజు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.