ఎలమంచిలి: తాగునీటిలో క్లోరిన్ శాతం తనిఖీ

83చూసినవారు
ఎలమంచిలి: తాగునీటిలో క్లోరిన్ శాతం తనిఖీ
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డు సన్యాసమ్మపేట ప్రాంతంలో గురువారం ఉదయం ప్రజలకు సరఫరా చేస్తున్న మంచినీటిని మున్సిపల్ తాగునీటి విభాగం ఏఈ గణపతిరావు పరిశీలించారు. తాగునీటిలో క్లోరిన్ శాతాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు. ఉండాల్సిన మోతాదులోనే క్లోరిన్ (1పీపీఎం) ఉన్నట్లు తెలిపారు. హెచ్చుతగ్గులు ఉంటే నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగి వహీద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్