ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ టెస్ట్ లో పాల్గొని మంచి మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం యలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్లో సీఐ ధనుంజయ్ బహుమతులు అందజేశారు. మోడల్ టెస్ట్ రాసిన విద్యార్థులకు పరీక్షలపై అవగాహన వస్తుందని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సావిత్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం బాలాజీ, టీచర్ సుధారాణి పాల్గొన్నారు.