యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక వెటర్నరీ హాస్పిటల్లో చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్ పర్యవేక్షణలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహిస్తున్నామన్నారు. యానిమల్ బర్త్ కంట్రోల్-2023 ప్రకారం కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.