యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 5వ తేదీన సబ్ జూనియర్ బాయ్స్ జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలు జరుగుతాయని అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కే. నరేశ్ శుక్రవారం తెలిపారు. ఎంపిక పోటీల్లో 2009 సంవత్సరం తర్వాత జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఈ పోటీల్లో అర్హత సాధించినవారు జనవరి 17 నుంచి మదనపల్లెలో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారని అన్నారు.