యలమంచిలి: "లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి"

52చూసినవారు
యలమంచిలి: "లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి"
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి కుట్ర పన్నుతున్నట్లు సీపీఎం యలమంచిలి మండలం కార్యదర్శి సిహెచ్ శివాజీ అన్నారు. ఈ కోడ్స్ అమలు చేస్తే కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా బుధవారం యలమంచిలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ కోడ్స్ అమల్లోకి వస్తే కార్మికులు హక్కులు కోల్పోతారన్నారు.

సంబంధిత పోస్ట్